బ్రేకింగ్ :కేసీఆర్ అనే నేను...!! ఎప్పుడంటే...?

Update: 2018-12-12 06:51 GMT

కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసీఆర్ తో పాటు మరో ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది. పండితుల సూచన మేరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి రేపు మంచి ముహూర్తంగా నిర్ణయించారు. తొలి మంత్రివర్గంలో ఎవరుంటారనేది ఆసక్తిగా మారింది.

పూర్తి విస్తరణ పార్లమెంటు ఎన్నికల తర్వాతేనా?

ప్రస్తుతం కొందరితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి పార్లమెంటు ఎన్నికల అనంతరం విస్తరణ పూర్తి స్థాయిలో జరపాలని, అప్పుడే నేతలు కట్టుదిట్టంగా, కలసికట్టుగా పనిచేస్తారన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. రాజ్ భవన్ వర్గాలకు ఇప్పటికే రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేసీఆర్ తో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ సిబ్బంది ఇప్పటికే ప్రమాణస్వీకారం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News