చంద్రబాబు దద్దమ్మ

Update: 2018-12-29 12:19 GMT

హైకోర్టు విభజన అడ్డగోలుగా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు సరికావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు.ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవతుందనుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. చంద్రబాబు మాటలకు తలా తోక ఉండదన్నారు. డిసెంబరులోనే హైకోర్టును ఏపీకి తీసుకెళతామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసే నీచ రాజకీయాలు దేశంలో ఎవరూ చేయరన్నారు. నవీన్ పట్నాయక్ ను తాను కలిస్తే చంద్రబాబుకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుందని ప్రశ్నించింది చంద్రబాబు కాదా? అని ఆయన అడిగారు. నాలుగేళ్లు బీజేపీ చెంత చేరింది ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబు మనిషిలాగే మాట్లాడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంత డర్టీయెస్ట్ పొలిటిషయన్ మరొకరు ఉండరన్నారు. నాలుగేళ్లు మోడీ సంకనాకి, ఇప్పుడు రాహుల్ సంకనాకుతున్నారన్నారు. హరికృష్ణ శవం ముందే చంద్రబాబు రాజకీయాలు చేశారన్నారు. సుహాసినికి ఇప్పుడు ఏం న్యాయంచేస్తావని నిలదీశారు. అలాంటి నాయకుడిని భరిస్తున్నందుకు ఆంధ్రప్రజల కాళ్లు మొక్కాలని కేసీఆర్ అన్నారు. దిక్కుమాలిన శ్వేతపత్రాలను విడుదల చేసి డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. చంద్రబాబు దద్దమ్మ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్వయం ప్రకాశం లేని వ్యక్తి అన్నారు. ధైర్యం లేదన్నారు. చంద్రబాబులాగా దిక్కుమాలిన రాజకీయాలు చేయనన్నారు. తాను ఫెడరల్ ఫ్రంట్ ఎందుకు తెస్తున్నానో త్వరలోనే బాబుకు అర్థమవుతుందన్నారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే....

విపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ప్రజలను వంచించేందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బీసీల మీద ప్రేమ ఎవరికుందో ప్రజలకు తెలుసునన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజాతీర్పు ఎలా ఉంటుందో తెలిసి వచ్చినా తీరు మార్చుకోలేదన్నారు. మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. ఎన్నికలకు ముందే తాము పంచాయతీ ఎన్నికలకు సిద్ధమయ్యామన్నారు. హైకోర్టు ఆదేశాలతో జనవరి పదో తేదీలోగా పంచాయతి ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా ఇంకా విపక్షాలకు బుద్ధిరాలేదన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినా వారికి 103 చోట్ల డిపాజిట్లు రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు చక్రం తిప్పేది లేదు మన్ను లేదన్నారు. గతంలోనూ తిప్పింది లేదు చచ్చింది లేదన్నారు. ఐటీలో కూడా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. బ్యాక్ అప్ మెకానిజం, డిజాస్టర్ మెకానిజం అనే రెండు సూత్రాలతో ఐటీ కంపెనీలు సేఫ్ గా ఉండే హైదరాబాద్ ను ఎంచుకున్నాయన్నారు. ఇందులో చంద్రబాబు గొప్పతనమేమీ లేదన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భూకంపాలు అతితక్కువగా ఉన్న ప్రాంతమైన హైదరాబాద్ ను ఐటీ కంపెనీలే ఎంపిక చేసుకున్నాయని కేసీఆర్ వివరించారు. ఎన్. జనార్థన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ పిలిపించి నేదురుమిల్లి కి చెప్పడంతో ఐటీ సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయన్నారు.

కాంగ్రెస్ ది మొసలి కన్నీరు...

రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలదు మొసలి కన్నీరు అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు యాభై శాతానికి మించవద్దని కాంగ్రెస్ నేతలే కోర్టుకు వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. చేనేత కార్మికుల జీవితాల్లో తాము వెలుగులు నింపామన్నారు. బీసీలను నాశనం చేసింది కాంగ్రెస్, టీడీపీలేననితెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా తామేదో రిజర్వేషన్లు తగ్గించినట్లు కాంగ్రెస్ వాళ్లు కట్టుకధలు అల్లుతున్నారన్నారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలప్రకారమే తాము ముందుకు వెళుతున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం నడుచుకోవాల్సిందేనన్నారు. హైదరాబాద్ లో అన్ని వర్గాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తామని తెలిపారు. కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖ ఉండాలని తాను చాలా సార్లు ప్రతిపాదించానని తెలిపారు. బీసీలకు అందరికంటే ఎక్కువ మేలు చేసింది ఎన్టీఆర్ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ కమిటీలలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. పంచాయతీలు నిర్వహించకుండా కాంగ్రెస్ వాళ్లు గతంలోనే అడ్డుపడ్డారన్నారు. కాంగ్రెస్ నేతలు ఇడియట్ లా మాట్లాడుతున్నారన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన అడ్డగోలు చేశారని చంద్రబాబు అన్న వ్యాఖ్యలు సరికాదని కేసీఆర్ అన్నారు.

Similar News