ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయంటే...?

Update: 2018-05-12 13:53 GMT

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో జరిగిన ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరిచారు. సుమారు 65 శాతం పోలింగ్ ఈ ఎన్నికల్లో నమోదైంది. దీంతో ఓటింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉందోనని పార్టీలు, అభ్యర్థులు విశ్లేషణల్లో మునిగిపోయారు. ఫలితాల వెల్లడికి ఈ నెల 15 వరకు సమయం ఉన్నందున ప్రాథమికంగా ఫలితాలను అంచనా వేసే వివిధ ఎగ్జిట్ పోల్ లను పరిశీలిస్తున్నారు. పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు శనివారం పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. కానీ, ఎగ్జిట్ పోల్ సర్వేల్లోనూ ఫలితాలు రెండూ పార్టీలకు అనుకూలంగా వచ్చాయి. టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఎన్డీటీవీ సర్వేలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఫలితాలు ఉండనున్నాయని స్పష్టం చేశాయి. పలు సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తిరిగి కైవసం చేసుకుంటాయని తెలపగా, మరికొన్ని మాత్రం ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలకం కానుందని స్పష్టం చేశాయి. రిపబ్లిక్ టీవీ, ఏబీపీ-సీ ఓటర్, న్యూస్ ఎక్స్ ఛానల్ సర్వేలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని అంచనా వేశాయి.

టైమ్స్ నౌ, వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ వివరాలు

కాంగ్రెస్ - 90-103

బీజేపీ - 80-93

జేడీ(ఎస్) - 31-39

ఇతరులు - 2

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ వివరాలు

కాంగ్రెస్ - 73-82

బీజేపీ - 95-114

జేడీ(ఎస్) - 32-43

ఇతరులు - 0-3

ఇండియా టుడే

కాంగ్రెస్ - 106-118

బీజేపీ - 79-92

జేడీ(ఎస్) - 22-30

ఇతరులు - 1-4

పీపుల్స్ పల్స్

కాంగ్రెస్ - 93-103

బీజేపీ - 83-93

జేడీ(ఎస్) - 33-43

ఇతరులు - 2-4

ఎన్డీటీవీ

కాంగ్రెస్ - 90-103

బీజేపీ - 80-93

జేడీ(ఎస్) - 31-39

ఇండియా టీవీ

కాంగ్రెస్ - 97

బీజేపీ - 87

జేడీ(ఎస్) - 35

ఇతరులు - 3

ఏబీపీ, సీ-ఓటర్

కాంగ్రెస్ - 87-99

బీజేపీ - 97-109

జేడీ(ఎస్) - 21-30

ఇతరులు - 1-8

న్యూస్ ఎక్స్ ఛానెల్

కాంగ్రెస్ - 72-78

బీజేపీ - 102-114

జేడీ(ఎస్) - 35-39

Similar News