కర్ణాటకలో కాంగ్రెస్ వద్ద మూడు ప్లాన్లు...!

Update: 2018-05-16 10:57 GMT

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. యడ్యురప్పకు గవర్నర్ ఇవాళ మళ్లీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న తమను కాదని ఒకవేళ గవర్నర్ గనుక యడ్యురప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తే ఎదుర్కునేందుకు మూడు ప్లాన్లు సిద్ధం చేస్తొంది. మొదటి ప్లాన్ గా గవర్నర్ ముందు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించాలని, రెండో ప్లాన్ గా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, మూడో ప్లాన్ గా ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ముందు పరేడ్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సుప్రీం కోర్టులో రిట్ వేసేందుకు కాంగ్రెస్ అడ్వకేట్లు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఎమ్మెల్యేలు అందరూ వచ్చారుగా...

కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారన్న వార్తలు నిజం కాదని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అంతా సమావేశానికి హాజరయ్యారని ఆయన స్పష్టం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు బీదర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చేందుకు ఆలస్యమైందని, తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక్కటిగానే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి టచ్ లో లేరని, వీరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఉదయం నుంచి వార్తలు వచ్చాయి.

Similar News