బాలకృష్ణతో రాయబారం, కళ్యాణ్ రామ్ నో...?

Update: 2018-11-04 07:20 GMT

నందమూరి హరికృష్ణ మరణం తరువాత టీడీపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఆయన మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కటి అయ్యారు. హరికృష్ణ అంత్యక్రియల్లో అన్ని పనులు బాలకృష్ణనే చూసుకున్నాడు. అలానే 'అరవింద సమేత' సక్సెస్ మీట్ కి వచ్చి సపోర్ట్ గా నిలిచాడు బాలయ్య. రాజకీయంగా ఎన్టీఆర్ ను..కళ్యాణ్ రామ్ ను వాడుకునేందుకు చంద్రబాబు వేస్తున్న ప్లాన్ ఇది అని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.

బాలకృష్ణ ని ఉపయోగించి ఎన్టీఆర్ ను..కళ్యాణ్ రామ్ లను రాజకీయంగా వాడుకునే దిశగా బాబు అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈనేపధ్యంలో కళ్యాణ్ రామ్ ను జూబ్లీ హిల్స్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయమని ప్రతిపాదన బాలకృష్ణ ద్వారా పంపినట్టు తెలుస్తుంది. హరికృష్ణ మరణంతో సింపతీ వర్క్ అవుట్ అవుతుందని దాని వల్ల అక్కడ కళ్యాణ్ రామ్ గెలుపొందే అవకాశం ఉందని చంద్రబాబు ఆలోచనట.

బాలకృష్ణ కళ్యాణ్ రామ్ కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగా చాలా సున్నితనంగా తిరస్కరించారట. మరో పది ఏళ్ళ పాటు సినిమాలపైనే ఫోకస్ చేయాలనీ అనుకుంటున్నానని అప్పటివరకు రాజకీయాల జోలికి వెళ్లనని చెప్పాడట. దాంతో చంద్రబాబు వేసిన ప్లాన్ బిడిసికొట్టినట్లయింది. కాకపోతే వీరిని ప్రచారం కోసం వాడుకోవాలని చూస్తున్నారట చంద్రబాబు. మరి దీనికైనా వారు 'ఎస్' చెపుతారేమో చూడాలి.

Similar News