బ్యూటీ కాంటెస్ట్ లో పిచ్చకొట్టుడు

Update: 2022-10-27 02:25 GMT

న్యూయార్క్‌లోని స్టాటెన్ ఐలాండ్‌లో తొలిసారిగా జరిగిన మిస్ శ్రీలంక అందాల పోటీలో పలువురు ఘర్షణకు దిగారు. ఈ ఈవెంట్ కు సంబంధించి జరిగిన పార్టీలో జరిగిన ఒకరినొకరు కొట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 300 మందికి పైగా అతిథులు హాజరైన ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించడాన్ని వీడియోలలో చూడవచ్చు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఘర్షణకు కారణమేమిటనేది స్పష్టంగా తెలియలేదు.. ఈ గొడవల్లో కొంత ఆస్తి కూడా దెబ్బతింది. ఈ ఘర్షణకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. USకు వలస వచ్చిన శ్రీలంక వాసులతో కలిసి ఈ చారిటీ ప్రోగ్రాం ను ఏర్పాటు చేసి.. సహాయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఐలాండ్‌లో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే14 మంది పోటీదారులలో ఎవరూ ఈ గొడవల్లో భాగం అవ్వలేదని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. సూట్ వేసుకున్న వ్యక్తులు ఒకరిపై మరొకరు పడి కొట్టుకోవడం వీడియోలలో చూడవచ్చు.. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే కలగజేసుకుని.. పక్కకు వెళ్ళమని వారిని కోరుతూ కనిపించింది.

ఈ సంఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. శ్రీలంకకు చెందిన సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి ప్రవర్తన యునైటెడ్ స్టేట్స్‌లో తమ ప్రతిష్టను దిగజార్చుతుందని అన్నారు. ఇలాంటి ఘటనలు శ్రీలంక ఇమేజ్ కు అత్యంత అవమానకరమైనదని.. ఇబ్బందికరమైనది కూడా అని తెలిపారు. వారందరినీ అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని క్యాన్సర్ ఆసుపత్రికి నిధుల సేకరణ కోసం నిర్వహించిన పోటీలో ఏంజెలియా గుణశేఖర మిస్ శ్రీలంక న్యూయార్క్ కిరీటాన్ని కైవసం చేసుకుంది.



Tags:    

Similar News