లక్కీగా బ్రతికిపోయాడు.. హెల్మెట్ లో పాము

కేరళలో ఒక వ్యక్తి పాము కాటు నుండి జస్ట్ మిస్ అయ్యాడు. తన హెల్మెట్‌లో

Update: 2023-10-07 14:52 GMT

కేరళలో ఒక వ్యక్తి పాము కాటు నుండి జస్ట్ మిస్ అయ్యాడు. తన హెల్మెట్‌లో చిన్న నాగుపాము ఉందని గుర్తించడంతో పాము కాటు నుండి తృటిలో తప్పించుకున్నాడు. త్రిసూర్‌కు చెందిన సోజన్ తన కార్యాలయంలో పార్క్ చేసిన స్కూటర్ దగ్గరే హెల్మెట్‌ను ఉంచాడు. సాయంత్రం అతను ఇంటికి వెళ్ళడానికి తన వాహనం దగ్గరకు చేరుకున్నాడు. అతని హెల్మెట్‌లో ఏదో ఉందని గుర్తించాడు.

వెంటనే అటవీ శాఖను అప్రమత్తం చేశాడు. లిజో అనే వాలంటీర్ అక్కడకు చేరుకున్నాడు. నిశితంగా పరిశీలించగా హెల్మెట్ లోపల విషపూరితమైన నాగుపాము కనిపించింది. పాములు పట్టే వ్యక్తి హెల్మెట్‌ను నేలపై ఉంచి పాము కోసం జాగ్రత్తగా వెతకగా.. అది బయటకు రాకుండా ఉండిపోయింది. అయితే ఆఖరికి హెల్మెట్ లోపలి భాగాన్ని పరిశీలించగా చిన్న నాగుపాము కనిపించింది. కొద్దిసేపటికి ఎలాగోలా బయటకు వచ్చేసింది. పాము వయస్సు దాదాపు 2 నెలలు మాత్రమే అని పామును పట్టిన వ్యక్తి చెప్పారు. "పెద్ద నాగుపాము కంటే చిన్న నాగుపాము కాటు చాలా ప్రమాదకరం" అని లిజో తెలిపారు.


Tags:    

Similar News