కర్వా చౌత్ రోజున ప్రేయసితో షాపింగ్ చేస్తూ భార్యకు పట్టుబడ్డాడు

Update: 2022-10-14 02:25 GMT

కర్వా చౌత్.. ఉత్తరాదిన చేసుకునే పెద్ద పండుగ. ఆ రోజున భర్త బాగుండాలని భార్యలు ఉపవాసం చేస్తూ ఉంటారు.. సాయంత్రం చంద్రుడిని జల్లెడలో చూసి ఆ తర్వాత భర్త ముఖాన్ని చూస్తారు. భర్తలు బాగుండాలని భార్యలు ఎంతో నిష్టతో పూజలు చేస్తుంటారు. అలాంటి రోజున భర్త తన ప్రేయసిని తీసుకుని మార్కెట్ లో షాపింగ్ కు వెళితే.. అదే సమయానికి భార్య కూడా అక్కడ తారసపడితే..! భర్తకు బడితెపూజనే.

ఘజియాబాద్ మార్కెట్ వద్ద ఓ మహిళ తన భర్తను చితక్కొట్టింది. కర్వా చౌత్‌ రోజున అతడు తన ప్రియురాలితో కలిసి షాపింగ్ చేస్తూ భార్యకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య తన స్నేహితులతో కలిసి భర్త కాలర్ పట్టుకుని కొట్టింది. ఘటనాస్థలిలో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. అతడి ప్రియురాలు రక్షించడానికి ప్రయత్నించగా ఆమెను కూడా భార్య కొట్టింది. భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తతో గొడవపడి భార్య తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె తన తల్లితో కలిసి కర్వా చౌత్‌లో షాపింగ్ చేయడానికి వచ్చింది. ఆ సమయంలో ఆమె తన భర్తను మరో మహిళతో తిరుగుతూ ఉండడాన్ని గుర్తించింది.




Tags:    

Similar News