అసలు పండగ అప్పుడే ...?

Update: 2018-12-30 18:29 GMT

ఫలితాలు వచ్చి మరో పదిరోజుల్లో నెల రోజులు అవుతున్నా తెలంగాణ లో మంత్రులు అవుదామని ఆశిస్తున్నా నేతలకు ఆ పదవులు ఊరిస్తూనే వున్నాయి. ముహుర్తాలు, జాతకాలు సెంటిమెంట్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కెసిఆర్ సంక్రాంతి వెళ్లెవరకూ మంచి రోజులు లేవన్న కారణంతో ప్రస్తుతానికి పదవుల పందేరానికి కామా పెట్టారు. రెండు సెంటిమెంట్ తో ముఖ్యమంత్రిగా తనతోపాటు మహమూద్ ఆలీని హోం మంత్రిగా చేసి గమ్మున వున్నారు. దాంతో గులాబీ శిబిరంలో రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. అదృష్టవంతులు ఎవరు ? దురదృష్టవంతులు ఎవరా అన్న ఎదురు చూపులు మరోపక్క క్యాడర్ లో ఆసక్తిని పెంచేస్తుంది.

వడపోతల్లో గులాబీ బాస్ బిజీ ...

కెసిఆర్ ఏమి చేసినా అందులో వెరైటీ ఉంటుంది. తాజా మంత్రి వర్గ విస్తరణలో సామాజిక వర్గాల సమతూకం తో బాటు అనేక ఈక్వేషన్స్ ను పరిగణలోకి తీసుకుంటున్నారు గులాబీ బాస్. రెండోసారి అధికారంలోకి రావడంతో మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య సైతం గణనీయంగా పెరిగిపోయింది. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ చేపడితే అసంతృప్తులు వచ్చే ప్రమాదం గ్రహించి తాత్కాలిక మంత్రి వర్గాన్ని సంక్రాంతికి ప్రకటించడానికి టి చంద్రుడు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్యెల్యే పనితీరు ఆధారంగా పూర్తిస్థాయి మంత్రి వర్గాన్ని ప్రకటించాలని కెసిఆర్ ఆలోచనగా గులాబీ పార్టీలో ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో టి సర్కార్ నూతన కొలువుపై మాత్రం సర్వత్రా చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. వీటికి పూర్తిగా తెరపడాలంటే మరికొంత కాలం ఆగలిసిందే

Similar News