జేసీ సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2018-07-19 13:50 GMT

అవిశ్వాస తీర్మానంపై జ‌రిగే చ‌ర్చ‌కు హాజ‌రుకాన‌ని మొండికేసిన అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రేపు లోక్‌స‌భ‌కు హాజ‌రుకావాల‌ని నిర్ణ‌యించిన ఆయ‌న చ‌ర్చ ముగిసిన త‌ర్వాత ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి, త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌నే కార‌ణం, స్థానిక స‌మ‌స్య‌ల‌ వ‌ల్లె ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మొద‌ట ఆయ‌న లోక్‌స‌భ‌కు కూడా హాజ‌రుకావ‌ద్ద‌నుకున్నా టీడీపీ సీనియ‌ర్ నేత ఒక‌రు ఫోన్ చేసి బుజ్జ‌గించ‌డంతో ఆయ‌న స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

రోడ్ల విస్త‌ర‌ణ‌కు జీఓ

లోక్ స‌భ‌కు హాజ‌రుకాన‌న్న జేసీ డిమాండ్ల‌ను అధినేత చంద్ర‌బాబు నాయుడు తెలుసుకున్నారు. అందులో ముఖ్యంగా అనంత‌పురంలో రోడ్ల విస్త‌ర‌ణ‌కు సంబంధించి ఆయ‌న ప‌ట్టుప‌ట్టారు. దీంతో దిగివ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు అనంత‌పురంలో రోడ్ల విస్త‌ర‌ణ‌కు నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేశారు. ఇందుకు గానూ రూ.45.56 కోట్ల‌ను విడుద‌ల చేస్తూ ప్ర‌భుత్వం జీఓ ఇచ్చింది.

Similar News