సౌండ్ లేదు…. పల్లెటూరి వాతావరణంలా?

దేశమంతా స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. సౌండ్ పొల్యూషన్ లేదు. వాయు కాలుష్యం లేదు. ప్రజలంతా ఇంటికే పరిమితమవ్వడంతో దేశంలో ప్రధాన నగరాల్లోని వీధులన్నీ బోసిపోయాయి. ప్రధాని నరేంద్ర [more]

Update: 2020-03-22 02:41 GMT

దేశమంతా స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. సౌండ్ పొల్యూషన్ లేదు. వాయు కాలుష్యం లేదు. ప్రజలంతా ఇంటికే పరిమితమవ్వడంతో దేశంలో ప్రధాన నగరాల్లోని వీధులన్నీ బోసిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు దేశం మొత్తం స్పందించింది. తమను తాము కాపాడుకోవడానికి స్వచ్ఛందంగా ప్రజలు కర్ఫ్యూను పాటిస్తున్నారు. ఉదయం నుంచి ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు.

ఆరుగంటల నుంచే…

తెలంగాణలోనూ ఉదయం ఆరు గంటల నుంచే కర్ప్యూ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన 24 గంటల జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి మంచి స్పందన కన్పించింది. ఆదివారం కూడా కావడంతో కలసి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. అత్యవసర సేవలను తప్పించి ఎవరూ బయటకు రావద్దని కోరడంతో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రజలు స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. వాహనాల శబ్దం లేకపోవడంతో హైదరాబాద్ పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తోంది.

Tags:    

Similar News