వైసీపీ హవాలో కొట్టుకుపోతున్న జనసేన

ఆంధ్రప్రదేశ్ లో తాము ప్రత్యామ్నాయం అని, తామే అధికారాన్ని చేపడతామని తెరమీదకు వచ్చిన జనసేన పార్టీకి ఘోర పరాభవం ఎదురవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పారట్ హవాలో తెలుగుదేశం [more]

Update: 2019-05-23 05:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో తాము ప్రత్యామ్నాయం అని, తామే అధికారాన్ని చేపడతామని తెరమీదకు వచ్చిన జనసేన పార్టీకి ఘోర పరాభవం ఎదురవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పారట్ హవాలో తెలుగుదేశం పార్టీ చతికిలపడగా జనసేన పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. ఏకంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం వెనుకంజలో పడిపోయారు. ఆయన భీమవరం నియోజకవర్గంలో మూడు స్థానానికి పరిమితం అయ్యారు. గాజువాకలో మాత్రం ఆయన గట్టి పోటీ ఇస్తున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక, ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న విశాఖపట్నంలో లోక్ సభ స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణ వెనుకంజలో ఉన్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ సైతం వెనుకబడ్డారు. మొదట కేవలం రాజోలు నియోజకవర్గంలో మాత్రమే కొంత జనసేనకు మెజారిటీ ఉన్నా తర్వాత వెనుకబడింది. ఫలితాలు సరళి ఇలాగే కొనసాగితే జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం కావచ్చు. గాజువాకలో మాత్రమే ఆయన కొంత విజయావకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News