చిన్నాన్న హ‌త్య‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

గ‌తంలో త‌న తండ్రిని క‌ట్ట‌డి చేయ‌డానికి ఎన్నిక‌ల ముందు త‌న తాత రాజారెడ్డిని చంపార‌ని, ఇప్పుడు త‌న‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి త‌న చిన్నాన్న‌ను హ‌త్య చేశార‌ని వైసీపీ [more]

Update: 2019-03-15 13:48 GMT

గ‌తంలో త‌న తండ్రిని క‌ట్ట‌డి చేయ‌డానికి ఎన్నిక‌ల ముందు త‌న తాత రాజారెడ్డిని చంపార‌ని, ఇప్పుడు త‌న‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి త‌న చిన్నాన్న‌ను హ‌త్య చేశార‌ని వైసీపీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు హ‌త్య‌లు జ‌రిగిన‌ప్పుడూ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడే ఉన్నార‌నిపేర్కొన్నారు. శుక్ర‌వారం పులివెందుల‌లో జ‌గన్ మీడియాతో మాట్లాడుతూ… వివేకానంద‌రెడ్డి హ‌త్య అత్యంత దారుణ‌మైన‌, నీచ‌మైన రాజ‌కీయ చ‌ర్య‌గా అని అన్నారు. 30 ఏళ్లుగా సౌమ్యుడిగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీని అతికిరాతంగా ఇంట్లోకి చొర‌బడి చంప‌డం దారుణ‌మ‌న్నారు. వివేకానందరెడ్డి ఎంత సౌమ్యుడో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. ఇంత దారుణ సంఘ‌ట‌న జ‌రిగితే ద‌ర్యాప్తు జ‌రుగుతున్న తీరును చూస్తుంటే బాధ‌గా ఉంద‌న్నారు. చ‌నిపోతూ లెట‌ర్ రాశార‌ని పోలీసులు ఓ లెట‌ర్ చూపిస్తున్నార‌ని, అందులో ఓ డ్రైవ‌ర్ పేరు రాసి కేసును ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు.

సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి…

బెడ్ రూంలో ఆయ‌న‌పై గొడ్డ‌లితో దాడి చేశాక బాత్ రూంలో ప‌డి చ‌నిపోయిన‌ట్లుగా చూపించ‌డానికి ఆయ‌న‌ను ఎత్తుకొని బాత్ రూంలోకి తీసుకెళ్లార‌ని అన్నారు. అక్క‌డ కూడా మూర్చ వ‌చ్చి చ‌నిపోయిన‌ట్లు ఏమార్చ‌డానికి ర‌క్తం పూశార‌ని అన్నారు. ఒక మ‌నిషిని ఎత్త‌కెళ్లి తీసుకెళ్లాడంటే ఒక్క‌రి ప‌ని కాద‌ని, ఒక‌రి కంటే ఎక్కువ మంది హ‌త్య చేశార‌ని ఆరోపించారు. ఇంత దాడి జ‌రిగిన త‌ర్వాత మంత‌కుల ముందు వివేకానంద‌రెడ్డి ఉత్త‌రం రాయ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. కేసును ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు న‌కిలీ ఉత్త‌రం సృష్టించార‌ని అన్నారు. తాను ఎస్పీతో మాట్లాడుతుండగానే ఇంటెలిజెన్స్ అడిష‌న‌ల్ డీజీ నుంచి ఎస్పీకి వ‌రుస‌గా ఫోన్లు చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాల‌న్నారు. చంద్ర‌బాబు గ‌తంలో త‌న తండ్రిని ఉద్దేశించి అసెంబ్లీకి ఎలా వ‌స్తావో చూస్తార‌ని బెదిరించార‌ని, త‌ర్వాత మూడు రోజుల‌కే త‌న తండ్రి మ‌ర‌ణించార‌న్నారు. ఈ కేసును కూడా సీబీఐ జేడీ విచార‌ణ జ‌రిపార‌ని, ఈ ఘ‌ట‌న‌పై త‌మ‌కు అనుమానాలు వ‌స్తున్నాయ‌న్నారు. త‌న‌పై టీడీపీ మ‌ద్ద‌తుదారు హ‌త్యాయ‌త్నం చేసిన కేసును కూడా ప‌క్కదారి ప‌ట్టించి ఎగ‌తాళి చేశార‌న్నారు. ఈ కేసులో చంద్ర‌బాబు కింద‌లేని వ్య‌వ‌స్థ విచార‌ణ చేస్తేనే నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్నారు.

Tags:    

Similar News