ఏపీ ప్రజలకు జగన్ కన్నీటి లేఖ

Update: 2018-08-10 13:10 GMT

ఈడీ ఛార్జ్ షీట్ లో వై.ఎస్ భారతి పేరును చేర్చినట్లు ఓ వర్గం మీడియలో వచ్చిన వార్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన భావోద్వేగంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రజాస్వామ్య వాదులకు బహిరంగ లేఖ రాశారు. ఏడేళ్లుగా టీడీపీ, కాంగ్రెస్ కలిసి కేసులు వేసి అన్యాయంగా జైళ్లో పెట్టినా, కోర్టుల చుట్టూ తిప్పుతున్నా ఏనాడూ బయపడలేదని, కానీ ఇవాళ తన భార్య భారతిని కూడా కోర్టుల చుట్టూ తిప్పాలని చూస్తున్నారని ఆరోపించారు. తనపై, తన కుటుంబంపై ఇంతటి శతృత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు. జగన్ లేఖలోని ముఖ్య అంశాలు...

  • ఛార్జి షీట్ ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే, కనీసం తమకు తెలియక ముందే ఈ విషయం బయటకు ఎలా తెలిసింది. కొన్ని పత్రికలు ఇలా ప్రచురించడం చూసి షాకయ్యాను.
  • సీబీఐ విచారణలో లేని అంశాలను ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఎలా చేర్చారు.
  • ఈడీలో చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేసే ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే అధికారులు తనను వేధిస్తున్నారు. ఈ విషయంపై 17 నెలల క్రితమే ప్రధానికి లేఖ రాశాను.
  • సదరు అధికారుల కాల్ డెటా పరిశీలిస్తే చంద్రబాబు కుట్ర బయటపడుతుందని, గాంధీ అనే అధికారి అసాధారణంగా మూడుసార్లు పదవీకాలాన్ని పొడిగించుకుని మరీ ఈడీలో కొనసాగుతున్నారు.
  • మామీద బురద జల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది..? భారతికి ఈ కేసులతో ఏమి సంబంధం ఉంది..?
  • ఏడేళ్ల క్రితం 2011, ఆగస్టు 10వ తేదీన అన్యాయంగా తనపై కేసులు నమోదు చేసి అక్రమంగా జైల్లో పెట్టారని, ఇప్పుడు మళ్లీ అదే రోజు తన కుటుంబంపై కక్షసాధింపు చేస్తున్నారు.
  • ఈ పరిణామాలతో బీజేపీతో టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు.
  • ప్రత్యర్థి పక్షాన్ని ప్రజల్లో ఎదుర్కోలేక వ్యవస్థల ద్వారా దెబ్బతీసి చంద్రబాబు అధికారంలో కొనసాగాలనుకుంటున్నారు.
  • నాడు నా తండ్రిని, తర్వాత న్ను చంద్రబాబు టార్గెట్ చేశారు. ఇప్పుడు నా భార్యను టార్గెట్ చేస్తున్నారు.
  • తొమ్మిదేళ్లుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల తరుపున పోరాడుతున్నానని, ఆనాడు సమైక్యాంద్ర కోసం, నేడు ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నాము. కానీ, చంద్రబాబు బయట పోరాటం చేస్తున్నట్లు నటిస్తూ లోపల లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు. లోక్ సభలో స్వయంగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చంద్రబాబు వారి శాశ్వత మిత్రుడే అన్నారు.

Similar News