ఏపీలో మరో అధికారి డిప్యూటేషన్ రద్దు

ఐఆర్ఎస్ అధికారి సీహెచ్ వెంకట గోపీనాధ్ డిప్యుటేషన్ ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. గోపీనాధ్ విజ్ఞప్తి మేరకు ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రభుత్వం [more]

Update: 2019-12-14 14:53 GMT

ఐఆర్ఎస్ అధికారి సీహెచ్ వెంకట గోపీనాధ్ డిప్యుటేషన్ ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. గోపీనాధ్ విజ్ఞప్తి మేరకు ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.వచ్చే ఏడాది జూన్ 26 వరకూ డెప్యూటేషన్ ఉన్నప్పటికీ దానిని రద్దు చేయాలని గోపీనాధ్ ప్రభుత్వాన్ని కోరారు. మాతృ శాఖ అయిన సెంట్రల్ డైరెక్ట్ టాక్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీడీపీ హయాంలో వైద్యారోగ్య శాఖలో పనిచేసిన గోపీనాధ్ పై అవినీతి రోపణలున్నాయి. గోపీనాధ్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గతంలో సిఫార్సు చేశారు.

Tags:    

Similar News