కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ....!

Update: 2018-10-13 13:32 GMT

కాంగ్రెస్ కు కాలం కలిసి వస్తున్నట్లు లేదు. ఛత్తీస్ ఘడ్ లో అసలే మాయావతి వేరు కుంపటి పెట్టడంతో దిగులు పడ్డ హస్తం పార్టీ నేతలకు మరో దెబ్బ తగిలింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వచ్చే నెల 12వతేదీన మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ దేయీ ఉయికే కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సమక్షంలో పార్టీ కండువా కప్పేసుకున్నారు. గిరిజన నాయకుడిగా ఉన్న రామ్ దేయీ ఉయికే పార్టీని వీడటం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బేనన్నది విశ్లేషకుల అంచనా. రామ్ దేయీ ఉయికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఛత్తీస్ ఘడ్ లోని పాలి ప్రాంతంలో మంచి పట్టున్న నాయకుడిగా ఉయికేకు గుర్తింపు ఉంది.

Similar News