బ్రేకింగ్:ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా రికార్డ్ బ్రేక్

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా మరో సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్ లో చివరి వన్డేలో గెలిచి 2 – 1 తేడాతో సిరీస్ [more]

Update: 2019-01-18 10:50 GMT

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా మరో సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్ లో చివరి వన్డేలో గెలిచి 2 – 1 తేడాతో సిరీస్ ను దక్కించుకుంది. మెల్మోర్న్ లో ఇవాళ జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ మొదట్లోనే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వికెట్లు కోల్పోయింది. ఇక, కెప్టెన్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేసినా 46 పరుగుల వద్ద రిచర్డ్ సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని(87 నాటౌట్) మరో బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్(61 నాటౌట్) తో కలిసి నిలదొక్కుకుని భారత్ కు విజయం కట్టబెట్టారు. భారత్ 49.2 ఓవర్లలో 3 విక్కెట్లు మాత్రమే కోల్పోయి 234 పరుగులు సాధించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కంగారూల గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ లు కైవసం చేసుకోవడంతో టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.

Tags:    

Similar News