కుప్పకూలిన చారిత్రక బస్టాండ్

Update: 2018-07-05 06:23 GMT

హైదరాబాద్ గౌలిగూడ ప్రాంతంలో ఉన్న పురాతన సీబీఎస్ బస్టాండ్ కుప్పకూలిపోయింది. 88 సంవత్సరాల ఈ బస్టాండ్ నగరవాసులందరికీ సుపరిచితం. ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి బస్టాండ్ గా గుర్తింపు పొందింది. ఇమ్లిబన్ బస్టాండ్ నిర్మించక ముందు ఈ బస్టాండ్ నుంచే అన్ని జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు బస్సుల రాకపోకలు జరిగేవి. ఇమ్లిబన్ నిర్మించిన తర్వాత కేవలం సిటీ బస్సులకు మాత్రమే ఇది పరిమితమైంది. అయితే, ఇంత చరిత్ర కలిగిన ఈ బస్టాండ్ ఇటీవల శిథిలావస్థకు చేరింది. ఏ క్షణంలోనైనా కూలిపోనుందనే గుర్తించిన అధికారులు ముందుజాగ్రత్తగా ప్రయాణికులను, బస్సులను ఇందులోకి అనుమతించలేదు. దీంతో బస్టాండ్ కుప్పకూలినా ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు.

Similar News