ఉగ్రవాదితో నగర యువతి ప్రేమాయణం

Update: 2018-08-07 08:30 GMT

దేశంలో ఎక్కడ తీవ్రవాద కార్యకలాపాలు వెలుగు చూసినా దాని మూలాలు హైదరాబాద్ నుంచి బయట పడుతుంటాయి. ఇప్పడు అలాంటి లింకే బయట పడింది. దుబాయ్ కేంద్రంగా జరిగిన అబుదాబి మాడ్యుల్స్ లో కూడా హైదరబాద్ ప్రస్తవన వచ్చింది. 2016 నుంచి విచారణ చేస్తున్న ఈ కేసులో ఇప్పడు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అంతే గాకుండా ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా బయటకు వస్తున్నాయి. అబుదాబి మాడ్యుల్స్ పైన ఇప్పడు ఎన్ఐఎ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఎ విచారణ పూర్తి చేసింది. అయితే ఇందులో కొత్త కొత్త ఇన్ పుట్స్ రావడంతో విచారణ ను మళ్లీ చేస్తుంది. హైదరబాద్ సిటి కేంద్రంగా ఈ ఉగ్రవాద కుట్ర జరిగినట్లుగా ఎన్ఐఎ బావిస్తోంది.

సిరియా వెళ్లేందుకు ప్రయత్నించిన యువతి...

అందులో ఒక హైదరాబాద్ అమ్మాయిని ఉగ్రవాదులు ఇష్టపడ్డారని తెలిసింది. ఈ అమ్మాయి ఏకంగా సిరియాకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేసింది. అయితే సిటీ పోలీసుల నిఘా కళ్ల నుంచి అమ్మాయి తప్పించుకొలేకపొయింది. రెండుసార్లు సిటీ నుంచి శ్రీనగర్ మీదుగా సిరియాకు వెళ్లి ఉగ్రవాదిని వివాహాం చేసుకొవడానికి కూడా ప్రయత్నం చేసింది. అయితే ఇప్పడు ఈ అమ్మాయిని ఎన్ఐఏ అధికారులు విచారించబొతున్నారు. అమ్మాయి సొదరుడు అయిన బాసీత్ కు కూడా ఎన్ఐఏ తాఖీదులు ఇచ్చింది. దీనికి తొడుగా మొదటిసారిగా ఒక మైనర్ ను కూడా ఎన్ఐఏ విచారణకు పిలిచింది. ఎందుకంటే ఈ మైనరే ఉగ్రవాదుల ప్రేమకు అనుసంధానకర్తగా ఉన్నాడని ఎన్ఐఏ బావిస్తుంది. పాతబస్తీ షాహిన్ నగర్ లో ఉండే ఖదీల్ ఒక ఇంటర్ నెట్ సెంటర్లో వర్క్ చేస్తుంటారు. ఈ ఇంటర్ నెట్ సెంటర్ నుంచే ప్రేమాయణం కొనసాగినట్లుగా ఎన్ఐఏ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ ఖదీల్ కు నోటీసులు ఇచ్చి తమ ముందు హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షిస్తూ

దుబాయ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఐసిస్‌కు చెందిన అబుదాబి మాడ్యుల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) 2016 జనవరి 28న కేసు నమోదు చేసింది. ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు షేక్‌ అజర్‌ ఉల్‌ ఇస్లామ్‌ను, రెండో నిందితుడు అద్నాన్‌ హసన్‌ను, మూడో నిందితుడు మహ్మద్‌ ఫర్హాన్‌ షేక్‌లను అరెస్టు చేసింది. జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఈ ముగ్గురూ దుబాయ్‌లో స్థిరపడ్డారు. అక్కడ నుంచే ఐసిస్‌ కోసం పని చేశారు. ఈ ముగ్గురూ ఐసిస్‌కు చెందిన కీలక నేత ఖాలిద్‌ ఖిల్జీ(కేకే) ఆదేశాల మేరకు వ్యవహరించారు. పాకిస్థాన్‌కు చెందిన ఇతడు అప్పట్లో దుబాయ్‌ కేంద్రంగా ఐసిస్‌ కార్యకలాపాలు నడిపాడు. ఈ నలుగురూ కలిసి సోషల్‌ మీడియా ద్వారా యువకులను ఆకర్షిస్తూ దేశంలో యువతను ఐసిస్‌ కోసం రిక్రూట్‌ చేసుకోవడం, వారికి అవసరమైన నిధులు సమకూర్చడం, సిరియా వెళ్ళేందుకు సహకరించడం వంటివి చేయడానికి కుట్రపన్నారు.

సిరియా.. వయా బంగ్లాదేశ్.. అఫ్ఘనిస్థాన్

అప్పట్లో దుబాయ్‌లో నివసించిన హైదరాబాద్ ఈదిబజార్‌ వాసి మహ్మద్‌ ముజ్‌తబా ద్వారా చంద్రాయణగుట్ట సమీపంలోని హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్లా బాసిత్‌తో పరిచయం ఏర్పడింది. సిరియాకు చెందిన అబూ హంజా, అబు జకారియా నేరుగా బాసిత్‌తో పాటు అతడి సోదరి సనాతోనూ సంప్రదింపులు జరిపారు. 2014 ఆగస్టులో బాసిత్, నోమన్, అబ్రార్, మాజ్‌లతో కలిసి బంగ్లాదేశ్‌ మీదుగా ఆఫ్ఘనిస్థాన్‌కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశారు. బంగ్లాదేశ్‌ చేరుకోవడం కోసం కోల్‌కతా వరకు వెళ్లిన వీరిని అక్కడ పట్టుకున్న పోలీసులు నగరానికి తరలించారు. కౌన్సిలింగ్‌ చేసిన అనంతరం వీరిని విడిచిపెట్టారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దగ్గరపడుతుండగా టెన్షన్

అయినప్పటికీ తమ పంథా మార్చకోని బాసిత్, మాజ్, ఒమర్‌లు ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కడంతో అరెస్టు చేసి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. వీరిపై ప్రత్యేక దర్యాప్తు బృందం అభియోగ పత్రాలు సైతం దాఖలు చేసింది. వీరంతా నేరుగా ఐసిస్‌ నేత షఫీ ఆర్మర్‌తో సంబంధాలు నెరపారు. అబుదాబి మాడ్యుల్‌పై ఢిల్లీలో కేసు నమోదు చేసింది. అప్పట్లోనే ముగ్గురిని అరెస్టు చేసింది. అలాగే చెన్నై, ఢిల్లీల్లోనూ అరెస్టులు జరిగాయి. నాటి దర్యాప్తులోనే సిటీకి చెందిన బాసిత్, ఖరేషీ, అద్నాన్, సన సహా మొత్తం 12 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిపైనా ఎన్ఐఏ చార్జీ షీట్ కూడా దాఖలు చేసింది. ఓపక్క ఆగస్టు పదిహెను దగ్గర పడింది. మరోపక్క గణేష్ ఉత్సవాలకు సిటీ సిద్ధం అవుతున్న తరుణంలో ఉగ్రవాద కదలికలపైన ఎన్ఐఏ ఇప్పడు విచారణ ఆరంభించడంతో ఎదో కొత్త కీలకమైన విషయం ఉందని అనూమానం కలుగుతోంది.

Similar News