విన్నర్ ఆ పార్టీనేనటగా

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అన్నీ పార్టీలు ఎవరి ధీమాలో వారున్నారు. ఎవరికి వారు తమదే గెలుపని అంచనాలు వేసుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ఫలితాలు [more]

Update: 2019-10-24 00:30 GMT

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అన్నీ పార్టీలు ఎవరి ధీమాలో వారున్నారు. ఎవరికి వారు తమదే గెలుపని అంచనాలు వేసుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి.

ఉత్తమ్ రాజీనామాతో…..

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికవడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో హుజూర్ నగర్ లో ఈనెల 21వ తేదీన ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి బరిలో నిలిచారు. ఇక అధికార టి.ఆర్.ఎస్ పార్టీనుంచి ఉత్తమ్ పై గత సాధారణ ఎన్నికల్లో ఓటమి చెందిన సైదిరెడ్డి పోటీచేశారు. ఇక బీజేపీ నుంచి రామారావు, టీడీపీ నుంచి కిరణ్మయి లతో పాటు మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జరిగిన ఉప ఎన్నిక స్వల్ప చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది.

గెలుపు మాదే….

ఉప ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే. పోటా పోటీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి, టి.ఆర్.ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మధ్యే ఉంటుంది. ఇక ఇతర పార్టీలైన బీజేపీ, టీడీపీ, ఇతర స్వతంత్రులు చీల్చే ఓట్లపై ఓట్ల శాతాన్ని తారుమారుచేసే అవకాశాలున్నాయి. ఎవరు గెలిచినా కొద్దిపాటి తేడాతోనే గెలుస్తారని అక్కడి పరిణామాలను బట్టి తెలుస్తోంది. సిట్టింగ్ సీటు తమదే నని కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అంటుండగా, గత సాధారణ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందామని సానుభూతి కూడా తమవైపే ఉంటుందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి ఫలాలే తమను గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు.

24న కౌంటింగ్

ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ మరికాసేపట్లో వెలువడనుంది. ఆ రోజు ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. కొద్దిసేపట్లో వారివారి అంచనాలు పటాపంచలు కానున్నాయి. గెలుపెవరిది….. ఓటమెవరిదో తేలనుంది. అంతవరకూ టెన్షన్ తప్పదు.

 

 

Tags:    

Similar News