ఇక అందరి చూపు వారిపైనే

హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుండడంతో అక్కడ ప్రచారం రోజు రోజుకు జోరందుకుంది. ఇప్పటి వరకు స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలు [more]

Update: 2019-10-16 09:30 GMT

హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుండడంతో అక్కడ ప్రచారం రోజు రోజుకు జోరందుకుంది. ఇప్పటి వరకు స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలు రెండు దఫాలుగా ప్రచారం చేశాయి. రోడ్ షోలతో దూసుకుపోయాయి. ఇక అన్ని పార్టీలు అధినేతలపైనే భారం పెట్టాయి.

మూడు రోజులే…..

హుజూర్ నగర్లో ఉప ఎన్నిక ప్రచారానికి మూడు రోజులే మిగిలింది. ఈనెల 19న సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లు అధినేతలను రప్పించి ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

రానున్న రేవంత్……

ఈ నెల 18, 19తేదీల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లోని ఏడు మండలాల్లో జరిగే రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలైన జానారెడ్డి, బట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, మల్లురవి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

కిషన్ రెడ్డి ప్రచారం……

హుజూర్ నగర్ లో బీజేపీ సైతం పోటాపోటీగా ప్రచారం చేస్తోంది. ఈ నెల 18న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. ఇప్పటికే లక్ష్మణ్ ఇక్కడ ప్రచారం చేసినప్పటికీ కేంద్రమంత్రి రానుండడంతో మరో సారి ప్రచారం చేయనున్నారు లక్ష్మణ్. మరోవైపు టీడీపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రచారంచేస్తున్నారు. రాష్ట్ర నాయకులు కొందరు అభ్యర్థి కిరణ్మయి తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారానికి రానున్నారు.

18న కేసీఆర్ సభ…

ఇక అధికార పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా తెలంగాణ నాయకులు విస్రృతంగా ప్రచారం నిర్వహించారు. మండలానికో ఇన్ ఛార్జిని నియమించింది పార్టీ. ఈ నెల 18న సీఎం కేసీఆర్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న బహిరంగసభలో పాల్గొంటారు. అంతకు ముందే కేటీఆర్ రోడ్ షోను కూడా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపాందించారు. ఇందుకు కేటీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 

 

Tags:    

Similar News