హైకోర్టు సీరియస్… అక్కడ పరీక్షలు చేయకపోవడంపై

గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గాంధీ లో కరోనా పరీక్షలు చేయకపోడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని ప్రభుత్వ [more]

Update: 2020-07-14 12:26 GMT

గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గాంధీ లో కరోనా పరీక్షలు చేయకపోడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు తప్పకుండా చేసేవిధంగా చర్యలు తీసుకోవాలంటూ పేర్కొంది . మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది. యశోద, కిమ్స్ ఆస్పత్రిలో పెద్ద మొత్తంలో లక్షల రూపాయల్ని రోగుల దగ్గర నుంచి వసూలు చేశాయని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని హైకోర్టు కోరింది. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని ఉపయోగించి ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో వసూలు చేస్తున్న చార్జీలను కట్టడి చేయాలని ఆదేశించింది. నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేస్తారా?చేయరో కూడా తెలపాలంటూ పేర్కొంది. ఈ కేసును ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది

Tags:    

Similar News