11 మంది సస్పెన్షన్… మరికొందరిపై క్రిమినల్ కేసులు

శ్రీశైలంలోని దేవస్థానంలో కుంభకోణంలో భాగస్వాములైన ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తం11 మంది దేవస్థాన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది .వీరితో పాటు డెప్యుటేషనుపై [more]

Update: 2020-06-11 12:32 GMT

శ్రీశైలంలోని దేవస్థానంలో కుంభకోణంలో భాగస్వాములైన ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తం11 మంది దేవస్థాన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది .వీరితో పాటు డెప్యుటేషనుపై ఆంధ్ర బ్యాంకు, ఇతర ఏజెన్సీల ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. మొత్తం 33 మంది ఉద్యోగులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసింది. వీరి వద్ద నుంచి సొమ్ము రికవరీకి ఆదేశాలు జారీ చేసింది. దేవదాయ శాఖ విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని సూచిచింది.శ్రీశైలంలో మొత్తం రూ. 2.56 కోట్ల మేర అక్రమాలకు పాల్పడట్టు నివేదిక ప్రభుత్వానికి అందింది.

Tags:    

Similar News