ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా

కొండాపూర్ లో సాఫ్ట్వేర్ కుటుంబానికి చెందిన అయిదు మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్ లోని కొండాపూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న [more]

Update: 2020-05-26 08:07 GMT

కొండాపూర్ లో సాఫ్ట్వేర్ కుటుంబానికి చెందిన అయిదు మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్ లోని కొండాపూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సాఫ్ట వేర్ ఇంజనీర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అతనితో పాటు ఇంట్లో ఉన్న మరో నలుగురికి కూడా కరోనా పాజిటివ్ పరీక్షలు హాస్పిటల్ కి తీసుకెళ్లి నిర్వహించారు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ లో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కరోనా పాజిటివ్ రాగా, ఈరోజు వైద్య పరీక్షలో భార్య(31) , కొడుకు(3), మూడున్నారేళ్ల కోడలు, బావమరిది(34) ఈ నలుగురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు వీరందరినీ వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించారు.

Tags:    

Similar News