కాంగ్రెస్ సీనియర్ నేతకు సమన్లు

Update: 2018-06-05 12:18 GMT

సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కి ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 7న కోర్టు లో హాజరుకావాలని ఆదేశించింది. భార్య మృతి కేసులో ఎంపీ శశిథరూర్ ను నిందితుడిగా పేర్కొంటూ దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సునందను హింసించాడని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని థరూర్ పై అభియోగం మోపారు. సునంద ఒత్తిడితో ఉన్న సమయంలో శశిథరూర్ ఆమెను పట్టించుకోలేదని, ఫోన్లకు, మెసేజ్ లకు స్పందించలేదని పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. దీంతో చనిపోవడానికి వారం రోజుల ముందు సునంద తనకు బతకాలని లేదని, చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు శశి థరూర్ కి ఈమెయిల్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఓ హోటల్ లో ఆహె జనవరి 17, 2014 నాడు అనుమానాస్పద స్థితిలో మరణించి ఉంది. దీనిపై ఢిల్లీ పోలీసులు విచరణ జరిపి మూడు వెల పేజీల అభియోగపత్రం కోర్టులో సమర్పించారు.

Similar News