కొబ్బరి చిప్ప ఖరీదు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

ఒక కొబ్బరికాయ ధర ఎంత అంటే రూ.20 లేదా మహా అయితే రూ.30 అనే సమాధానం వస్తుంది. ఇక, కొబ్బరి చిప్పల ధర ఎంత అంటే మాత్రం… [more]

Update: 2019-01-16 11:02 GMT

ఒక కొబ్బరికాయ ధర ఎంత అంటే రూ.20 లేదా మహా అయితే రూ.30 అనే సమాధానం వస్తుంది. ఇక, కొబ్బరి చిప్పల ధర ఎంత అంటే మాత్రం… చిప్పలకు ధరేంటి అలా పడి ఉన్నాయి తీసుకెళ్లండి అంటారు. కానీ, అదే కొబ్బరి చిప్పలను అమెజాన్ లో అమ్ముతున్నారు. గుండుసూదీ నుంచి ప్రతీ వస్తువును ఆన్ లైన్ లో అమ్ముతున్న ఈ రోజుల్లో కొబ్బరి చిప్పలను కూడా అమ్ముతున్నారు. అయితే, వీటి ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఒక్క కొబ్బరి చిప్ప ధర అక్షరాల మూడు వేల రూపాయలు. ఇక, డిస్కౌంట్ పోను 1,365 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగని ఈ చిప్పలో ఏదో మహత్యమో, ప్రత్యేకతో ఏమీ లేవు. మామూలు కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప అమ్మడమే చూసి ఆశ్చర్యపోయిన ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి ధర చూసి ఆశ్చర్యపోయారు. వీటిని స్క్రీన్ షాట్ తీసి ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News