అండగా ఉంటామని అణగదొక్కారు....!!

Update: 2018-12-23 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు అందరం బాధపడ్డామని, విభజన అనివార్యమయినప్పుడు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేసి ఉండాల్సిందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. విభజనహామీలపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి న్యాయం జరగాలంటూ పలు అంశాలను విభజన చట్టంలో కాంగ్రెస్ చేర్చిందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదన్నారు. ప్రజల్లో విశ్వాసం నింపేదిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీజేపీ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందన్నారు.

విభజన చట్టంలో ఉన్నవీ.....

ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏపీ అభివృద్ధి కుంటుపడకుండా పలు చర్యలు తీసుకున్నామన్నారు. నవనిర్మాణ దీక్షలు, సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ శ్వేతపత్రంలో వాస్తవాలను ఉంచామన్నారు. విభజన చట్టంలో ఏమున్నాయి? వేటని అమలు పర్చారో ఉంచామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మోసం చేసిందన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతుందని గతంలోనే తాను కేంద్రప్రభుత్వాన్ని కలిసినా ఫలితం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి కూడా కేంద్రం సహకరించడం లేదన్నారు.

ఎన్ని రకాలుగా నిలదీసినా.....

ఏపీ విభజన హామీల కోసం పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ మోదీ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా నిలదీసిందన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం తమను అణగదొక్కే ప్రయత్నం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ కూడా ఇవ్వలేదని ఆవేదన చెందారు. రాజ్యాంగాన్ని కూగా మోదీ గౌరవించడం లేదన్నారు. దుర్మార్గానికి ఒక హద్దులుంటాయన్నారు. చట్టంలో పొందుపర్చే అంశాలను కూడా అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫేస్టోలో కూడా ప్రత్యేకహోదా పెట్టిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. అండగా ఉంటామన్న వాళ్లే నమ్మించి మోసం చేశారన్నారు. బీజేపీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Similar News