బ్రేకింగ్ : రాహుల్ గాంధీ చంద్రబాబు భేటీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఆయన మొదట రాహుల్ ను కలిసి మహాకూటమి ఏర్పాటుతో [more]

Update: 2019-01-08 14:03 GMT

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఆయన మొదట రాహుల్ ను కలిసి మహాకూటమి ఏర్పాటుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో టీడీపీ – కాంగ్రెస్ పొత్తుపై చర్చించారు. ఇక, ఫిబ్రవరిలో అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుందని చంద్రబాబు… రాహుల్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సభకు రాహుల్ ను ఆహ్వానించారు. అమరావతి సభకు మహాకూటమిలోని జాతీయ నేతలను ఆహ్వానించాలని టీడీపీ భావిస్తోంది. ఇక, ఇవాళ చంద్రబాబు… శరద్ పవార్, సీపీఐ, సీపీఎం నేతలను కూడా కలిసే అవకాశం ఉంది.

Tags:    

Similar News