బాబును అడ్డుకున్న మహిళ ఎవరు…?

భారతీయ జనతా పార్టీపై యుద్ధం ప్రకటించి తరచూ ఆరోపణలు గుప్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు నిన్న కొంత ఊహించని షాక్ తగిలింది. కాకినాడ పర్యటనలో ఉన్న [more]

Update: 2019-01-06 07:35 GMT

భారతీయ జనతా పార్టీపై యుద్ధం ప్రకటించి తరచూ ఆరోపణలు గుప్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు నిన్న కొంత ఊహించని షాక్ తగిలింది. కాకినాడ పర్యటనలో ఉన్న చంద్రబాబును బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా, కనీసం ఇంటెలిజెన్స్ ఊహలకు కూడా అందని విధంగా బీజేపీ నాయకులు సడన్ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీ మహిళా నాయకురాళ్లు ఈ నిరసనలో ఎక్కువగా పాల్గొన్నారు. దీంతో పోలీసులకు కూడా వీరిని అడ్డుకోవడం కష్టమైంది. దీంతో చంద్రబాబు కాన్వాయ్ నిలిచిపోయింది. ఏకంగా ఆయనే బస్సు నుంచి బయటకు వచ్చి మైక్ అందుకునే బీజేపీ నేతలపై మాటల దాడికి దిగారు.

కాకినాడ కార్పొరేటర్…

ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన చంద్రబాబు… ‘నాతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారు’ అంటూ ఓ మహిళను హెచ్చరించారు. నరేంద్ర మోదీ ముంచారని చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, సదరు మహిళ ఏమాత్రం భయపడకుండా… నరేంద్ర మోదీ ఎవరిని ముంచారని, ఆయన నిధులు ఇస్తున్నారు కదా, కాకినాడను స్మార్ట్ సిటీని చేశారు కదా అంటూ ఆమె చంద్రబాబుకు జవాబు చెప్పారు. దీంతో ఓ దశలో ఆమెను చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. అయితే, అంత ధైర్యంగా ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ కి ఎదురెళ్లి ఆయననే నిలదీసే ప్రయత్నం చేసిన బీజేపీ నాయకురాలు ఎవరనే ఆసక్తి నెలకొంది. చంద్రబాబును అడ్డుకున్న మహిళ బీజేపీ కార్పొరేటర్. కాకినాడ కార్పొరేషన్ లోని 36వ డివిజన్ కార్పొరేటర్ అయిన సాలగ్రామ లక్ష్మీప్రసన్న బీజేపో ఫ్లోర్ లీడర్ గా కూడా ఉన్నారు. బీజేపికి గట్టి మద్దతుదారు. ఏపీలో బీజేపీ ఉనికే ఉండదనుకునే సమయంలో ఆమె ధైర్యంగా చంద్రబాబుకు ఎదురెళ్లడం మాత్రం ఆశ్చర్యకరమే.

Tags:    

Similar News