మోదీ… ఓ పబ్లిసిటీ ప్రైమ్ మినిస్టర్

బీజేపీ దేశాన్ని విభజించాలనుకుంటోందని, తామంతా దేశాన్ని ఏకం చేయాలని అనుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన కలకత్తాలో జరిగిన విపక్షాల మెగా [more]

Update: 2019-01-19 08:51 GMT

బీజేపీ దేశాన్ని విభజించాలనుకుంటోందని, తామంతా దేశాన్ని ఏకం చేయాలని అనుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన కలకత్తాలో జరిగిన విపక్షాల మెగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ మోదీ పబ్లిసిటీ ప్రైమ్ మినిస్టర్ అని… పని చేసే ప్రైమ్ మినిస్టర్ కాదని ఎద్దేవా చేశారు. దేశానికి పని చేసే ప్రైమ్ మినిస్టర్ కావాలన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అవినీతి రహిత్ భారత్ ను నిర్మిస్తామని చెప్పిన బీజేపీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఈ ప్రభుత్వానికి రాజకీయాలు చేయడమే తప్ప ప్రజలు ముఖ్యంగా కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం కంటే ముందే దేశంలో ఆర్థిక ప్రగతి బాగుందన్నారు. రాష్ట్రాల హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తుందని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని… ఈ ప్రయత్నాన్ని మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఈవీఎంలు వద్దు… పేపర్ బ్యాలెట్ తేవాలి…

విభజించు – పాలించు అన్నట్లుగా బీజేపీ నీచ రాజకీయాలు చేస్తుందన్నారు. సీబీఐ, ఆర్బీఐ, ఈడీ వంటి వ్యవస్థలను ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ఈవీఎం అనేది ఒక పెద్ద మోసమని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఈవీఎంలు లేవన్నారు. విపక్షాలన్నీ కలిసి పేపర్ బ్యాలెట్ కోసం పోరాడతామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. బీజేపీ పతనానికి ఈ సభ నాంది పలుకుతుందన్నారు. 2019లో ఈ దేశం కొత్త ప్రధానమంత్రిని చూస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా అదే కోరుతున్నారని అన్నారు. ‘సేవ్ ఇండియా – సేవ డెమాక్రసీ పేరుతో విపక్షాలన్నీ ఏకమవడం గొప్ప విషయమన్నారు. దేశ భవిష్యత్ ను మార్చే దిశగా భారీ సభను నిర్వహించిన మమతా బెనర్జీని అభినందించారు. ఎన్టీఆర్.. నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు మొదటి మీటింగ్ విజయవాడలో… రెండో మీటింగ్ బెంగాల్ లో పెట్టారని అన్నారు. ఇప్పుడు కూడా అమరావతిలో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News