చామకూర మల్లారెడ్డి అనే నేను..

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఎవరూ ఊహించని విధంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి అవకాశం దక్కింది. సాధారణ పాడి రైతుగా ప్రస్తానాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి క్రమక్రమంగా ఎదిగారు. [more]

Update: 2019-02-19 06:44 GMT

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఎవరూ ఊహించని విధంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి అవకాశం దక్కింది. సాధారణ పాడి రైతుగా ప్రస్తానాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి క్రమక్రమంగా ఎదిగారు. విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి దేవంలోనే పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి పదవి చేపట్టాలనే కోరికతోనే ఆయన ఈసారి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. భారీ మెజారిటీతో గెలిచిన ఆయనకు మంత్రి పదవి కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అరుదైన అవకాశం ఇచ్చారు. మల్లారెడ్డికి విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Tags:    

Similar News