యూటర్న్ నాది కాదు...మీదే

Update: 2018-07-21 09:56 GMT

తాను యూటర్న్ తీసుకున్నానని ప్రధాని వ్యాఖ్యానించారని, కానీ హామీలు అమలు చేయకుండా యూటర్న్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మెజారిటీకి మోరాలిటీకి మధ్య నిన్న జరిగిన అవిశ్వాసంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

తాను ఎన్డీఏలో భాగస్వామిగా 29 సార్లు ఢిల్లీకి వచ్చి రాష్ట్రాని కి న్యాయం చేయాలని కోరినా స్పందించలేదన్నారు. కేసీఆర్ పరణితితో ఉన్నారని, తనను తక్కువ చేసేలా మాట్లాడారని, అవినీతి పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ తో తమను పోల్చారని, ఇవి ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు కాదని పేర్కొన్నారు. ప్రదాని మాటలు తనను ఎంతో బాధించాయన్నారు. రాష్ట్రానికి ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనబాటలో వెళితే అభివృద్ధి కాదని, ఆందోళనలు చేస్తూనే అభివృద్ధి సాధిస్తున్నామని పేర్కొన్నారు. తనకు కేంద్రంలో ఎటూవంటి పదవిపైనా ఆశలేదని, 1995-96లోనే తనకు అవకాశం వచ్చినా తాను వదులుకున్నానని గుర్తు చేశారు. నేషనల్ ఫ్రంట్ వద్ద నుంచి పలుమార్లు కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయించామని తెలిపారు. ఇప్పుడు కూడా దేశానికి ఒక డెవెలప్ మోడల్ ను తయారుచేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News