ఘోరంగా ఓడిపోయారే ?

ప్రపంచ కప్ పోటీలలో అనూహ్య అప్ సెట్ లు నాకౌట్ లో నడుస్తున్నాయి. గ్యారంటీగా ఫైనల్ చేరుతుందని అంతా అంచనా వేసిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయాన్ని [more]

Update: 2019-07-12 02:46 GMT

ప్రపంచ కప్ పోటీలలో అనూహ్య అప్ సెట్ లు నాకౌట్ లో నడుస్తున్నాయి. గ్యారంటీగా ఫైనల్ చేరుతుందని అంతా అంచనా వేసిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుని ఇంటిదారి పట్టింది. లీగ్ దశలో అద్భుత ఆటతీరుతో దూసుకుపోయి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది ఆస్ట్రేలియా. ఇండియా, దక్షిణాఫ్రికా లపై మాత్రమే ఓటమి పాలై అన్ని మ్యాచ్ లు గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బౌలింగ్ ముందు తేలిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 14 పరుగులకే కీలకమైన ఓపెనర్లను కోల్పోయి ఆరంభంలోనే తడబాటుకు గురైంది. ఆ తరువాత స్టీవ్ స్మిత్ 85 (119), అలెక్స్ క్యారీ 46 (70) స్టార్క్ 29 (36) అండతో 49 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కీలకమైన సెమీఫైనల్ లో భారీ స్కోర్ సాధించాలిసిన తరుణంలో ఇంగ్లీష్ బౌలర్ల దెబ్బకు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది ఆస్ట్రేలియా.

బ్యాటింగ్ లో దుమ్ము లేపిన ఇంగ్లాండ్ …

లక్ష్యం తక్కువగానే వున్నా టీం ఇండియా సెమిస్ లో ఒడిన తీరును గమనంలోకి తీసుకున్న ఇంగ్లాండ్ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి వికెట్ కి జాసన్ రాయ్ – బెయిర్ స్టో తో కలిపి నాలుగోసారి విజయవంతమైన సెంచరీ భాగస్వామ్యం ఇంగ్లాండ్ విజయానికి తిరుగులేని రాచబాట వేశారు. రాయ్ 85 (65) జోయ్ రూట్ 49 (46) కెప్టెన్ మోర్గాన్ 45 (39) బంతుల్లో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా 32.1 ఓవర్లలో 226 పరుగులను కేవలం రెండువికెట్లు కోల్పోయి 8 వికెట్ల ఘన విజయాన్ని రికార్డ్ చేసింది ఇంగ్లాండ్. ఈ అరుదైన అద్భుత విజయంతో 27 ఏళ్ళ తరువాత ఫైనల్ కి చేరుకుంది మోర్గాన్ సేన. వరల్డ్ కప్ లో ఆడుతున్న టీం లలో హాట్ ఫెవరెట్ లలో ఒకటైన డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ సెమిస్ లో ఇలా మరీ పోరాటం లేకుండా చేతులు ఎత్తేయడం క్రీడాభిమానులను నిరాశపరిచింది. మొత్తానికి లీగ్ లో పాయింట్ల టేబుల్ లో ఒకటి రెండు ప్లేస్ లలో టీమ్ ఇండియా – ఆస్ట్రేలియా నిలిస్తే ఇప్పుడు ఆ టీం లు ఇంటిదారి పట్టాయి. పాయింట్ల పట్టికలో మూడు నాలుగో స్థానాల్లో నిలిచిన ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ చేరుకోవడం విశేషం.

Tags:    

Similar News