జగన్ కు గ్రహాలూ… అనుకూలిస్తున్నాయా…??

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రధాన పార్టీలూ రెండూ గెలుపోటముల లెక్కలు కట్టడంలో బిజీగా ఉన్నారు. ఇక, పందెంరాయుళ్లు సైతం జోరు [more]

Update: 2019-04-17 13:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రధాన పార్టీలూ రెండూ గెలుపోటముల లెక్కలు కట్టడంలో బిజీగా ఉన్నారు. ఇక, పందెంరాయుళ్లు సైతం జోరు పెంచుతున్నారు. ఎవరు గెలుస్తారనే దానిపై పందాలు మొదలుపెట్టారు. అయితే, జ్యోతిష్యం ప్రకారం గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటున్నారు.

వాస్తుబలం మాత్రం….

ప్రస్తుతం ఆయనకు బుధ మహర్దశ నడుస్తుందని, వైసీపీ అధికారం చెపట్టేందుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని నల్లపెద్ది శివరామప్రసాదశర్మ అనే జ్యోతిష్య పండితుడు అంచనా వేశారు. అయితే, వాస్తురిత్యా చంద్రబాబు నాయుడుకు పరిస్థితి అనుకూలంగా ఉందనే వాస్తు పండితుడు కొమ్మినేని మల్లేశ్వరరావు చెబుతున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నూతనంగా నిర్మించిన ఇల్లు వాస్తు బాగుందని, ఈ బలం చంద్రబాబుకు కలిసి వస్తుందని, ఆయన మళ్లీ అధికారం చేపడతారని ఆయన అంచనా వేస్తున్నారు. మరి, జ్యోతిష్యం గెలుస్తుందా… వాస్తుబలం గెలుస్తుందా చూడాలి.

Tags:    

Similar News