వైఎస్ జగన్ కు డీజీపీ కౌంటర్

తనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుపై డీజీపీ ఠాకూర్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనపై ఫిర్యాదు ఇచ్చినట్లుగా మీడియాలో [more]

Update: 2019-02-05 10:52 GMT

తనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుపై డీజీపీ ఠాకూర్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనపై ఫిర్యాదు ఇచ్చినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయని, అయితే తనను ఎన్నికల సంఘం ఎటువంటి వివరణ అడగలేదని, అడిగితే స్పందిస్తానని అన్నారు. పోలీసులకు కులం ఉండదని, ఖాకీ కులం మాత్రమే ఉంటుందన్నారు. ఉద్యోగంలో చేరినప్పుడే కులాన్ని పక్కన పెట్టేస్తామన్నారు. మెరిట్, సీనియారిటీ ప్రకారమే పదోన్నతులు కల్పించామన్నారు. తాను గత రెండేళ్లుగా నిజాయితీగా, ప్రజల కోసం పనిచేస్తున్నానని పేర్కొన్నారు.

భయంతో జగన్ తప్పుడు ఆరోపణలు

ముఖ్యమంత్రి అవ్వలేననే భయంతోనే జగన్ తప్పుడు ఫిర్యాదు చేశారని హోంమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. డీజీపీ ఠాకూర్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో లా ఆండ్ ఆర్డర్ మరింత మెరుగుపడిందని అన్నారు. పదోన్నతులు ఒక వర్గానికి ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పదోన్నతులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రమోషన్లపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.

Tags:    

Similar News