ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతల జోరు

Update: 2018-06-13 12:47 GMT

ఢిల్లీలో వరుసగా బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు బుధవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షలు అమిత్ షాను కలిశారు. ఇక నుంచి రాష్ట్రంలో పార్టీ ప్రణాళిక, బీజేపీపై చంద్రబాబు, టీడీపీ చేస్తున్న దిష్ప్రచారాన్ని తిప్పికొట్టడంపై సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షలు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని టీడీపీ ప్రచారం చేస్తోందని, కానీ, ఏపీ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందని ప్రధాని చెప్పారన్నారు. చంద్రబాబుకు అందరి కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రధాన మోదీ అడిగారని, నమ్మినవాళ్లను మోసం చేయడం చంద్రబాబు నైజమని ప్రధానికి చెప్పాలని తెలిపారు. ఏ రాష్ట్రానికి చేయనన్ని పనులు ఏపీకి చేశామన్నారు. 2017-18లో ఏపీకి కేంద్రం రూ.1.26 లక్షల కోట్లు కేటాయించిందని, చంద్రబాబు యూటర్న్ తీసుకున్నా కేంద్రం సహాయం మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం, ప్రచారాలతో ప్రజల ముందు తమను దోషులుగా చూపించి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్న రోజు టీడీపీకి పుట్టగతులు ఉండవచి కన్నా విమర్శించారు.

మాకు రాజకీయాలు కాదు...రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం...

అమిత్ షాతో భేటీ అనంతరం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ... మా జాతీయ అధ్యక్షుడితో రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడామని, అన్ని శాఖలతో మాట్లాడి పనులు తొందరగా చేయించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, కానీ చంద్రబాబువి మాత్రం రాజకీయ ఆరాగం, పోరాటం మాత్రమేనన్నారు. ఏదైనా ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందా అని చంద్రబాబు ఆలోచించరని, కేవలం ఆ ప్రాజెక్టు ద్వారా ఎన్ని డబ్బులు సంపాదించవచ్చని మాత్రమే చంద్రబాబు ఆలోచిస్తారన్నారు. అధికారం ఉండగానే సొమ్ము వెనకేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నా, తీసుకోకపోయినా ఇప్పటివరకు అన్నిరాష్ట్రాల కంటే ఎక్కువే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని, అన్నింటినీ పూర్తి చేయడం తమ బాధ్యతన్నారు.

Similar News