విన్నాను….చేస్తాను

ఏపీ సీఎం జగన్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలాసలో నిర్మించిన 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ [more]

Update: 2019-09-06 07:57 GMT

ఏపీ సీఎం జగన్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలాసలో నిర్మించిన 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ ఆసుపత్రికి శంఖుస్థాపన చేశారు. కిడ్నీ బాధితులను ఆదుకునేందకు డయాలసిస్ స్టేజ్ 3 బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ కింద 5వేల రూపాయల పింఛన్ ఇస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. కిడ్నీ బాధితులందరికీ ఉచిత బస్ పాస్, ఉచిత ల్యాబ్ పరీక్షలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం జెట్టీనిర్మాణం, ఉద్దానం ప్రజలకోసం పరిశుభ్రమైన తాగునీటి సరఫరా పథకానికి జగన్ శంఖుస్థాపన చేశారు.

నాణ్యమైన బియ్యాన్ని….

ఇంటింటికి నాణ్యమైన బియ్యం పథకం ప్రారంభించారు.కాశీ బుగ్గలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పలు కార్యక్రమాలను లాంచనంగా ప్రారంభించి ప్రసంగించారు. నవంబర్ 21నుంచి మత్స్యకారులకు రూ10వేలు, జనవరి 26న అమ్మఒడికి శ్రీకారం చుడుతామని జగన్ ప్రకటించారు. పాదయాత్రలో ఎన్నో సమస్యలు విన్నానని వాటి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు జగన్. సొంత ఆటో, ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు రూ10వేలు ఇస్తామన్నారు. పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇలా అనేక జనరంజక పథకాలను జగన్ ప్రకటించారు.

Tags:    

Similar News