రజాకార్ల చేతుల్లో పెడతారా..? అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!

Update: 2018-09-15 07:51 GMT

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసీఆర్ పై, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమిత్ షా మాట్లాడుతూ...

- తెలంగాణలో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది.

- జమిలి ఎన్నికలను మొదట సమర్థించిన కేసీఆర్ అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలపై వందల కోట్ల భారం వేశారు. ఇవి అవకాశవాద రాజకీయాలు కాదా..?

- తన కుటుంబం కోసమే కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారని అందరికీ తెలుసు.

- కేసీఆర్ పాలన చూసిన తర్వాత టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని ఎవరూ అనుకోవడం లేదు.

- ఎంఐఎంతో పొత్తుపెట్టుకుంటున్న కేసీఆర్ తెలంగాణను మళ్లీ రజాకార్ల చేతుల్లో పెట్టాలనుకుంటున్నారా..?

- రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న హామీ ఏమైంది..? కనీసం కేంద్రం చేపట్టిన ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకాన్ని కూడా కేసీఆర్ అమలు చేయలేకపోయారు.

- మూడనమ్మకాలతో కేసీఆర్ సచివాలయానికి వెల్లకపోవడం సబబేనా..?

- దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది..? కనీసం ఈ ఎన్నికల్లోనైనా ఆ హామీని నెరవేరుస్తామని చెబుతారా..?

- ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను ప్రపంచస్థాయికి చేరుస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది.?

- నేరెళ్ల ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే దళితులను వేధించారు. పండించిన పంటకు మద్దతు ధర అడిగిన రైతులకు ఖమ్మంలో బేడీలు వేయించారు.

- టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం.

- టీఆర్ఎస్ తో మేము ఏరూపంలోని పొత్తు పెట్టుకోమని తెలంగాణ ప్రజలకు స్పష్టం చేస్తున్నాం. తెలంగాణ ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడాం.

- ఎన్నికల సమయంలో చంద్రబాబు అసత్య ప్రచారానికి తెరలేపారు. చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ వెనుక బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదు.

- చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారు.

- తెలుగువారు అంజయ్య, పీ.వీ.నరసింహారావుకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అటువంటి పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకుంటున్నారు.

- తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నాం. తెలంగాణ అభివృద్ధి కేంద్రం తరుపున ఇంతకాలం అన్ని విధాలుగా సహకరించాం. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.

Similar News