ఎన్నిక ఈరోజు అయినా… ఫలితం మాత్రం?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. అత్యంత హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ [more]

Update: 2020-11-03 02:03 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. అత్యంత హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల తరుపున జోబైడెన్ పోటీ పడుతున్నారు. ిప్పటికే ముందస్తు ఓటింగ్, ఈ మెయిల్ ద్వారా 9.2 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. దాదాపు 24 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. మొత్తం 538 మంది ప్రతినిధులను ఈ ఎన్నిక ద్వారా ఓటర్లు ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు వస్తే వారు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. అయితే మెయిల్ ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో అధ్యక్ష ఎన్నిక ఫలితం ఇప్పట్లో తేలే అవకాశం లేదు.

Tags:    

Similar News