అమరావతిలో మరో ముందడుగు….!!!

అమరావతిలోని రాజధాని నిర్మాణంలో మరో ముందడుగుపడింది.ఐకానిక్ టవర్ల నిర్మాణంలో రెండో టవర్ కు ఈరోజు కాంక్రీట్ పనులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు [more]

Update: 2018-12-27 03:34 GMT

అమరావతిలోని రాజధాని నిర్మాణంలో మరో ముందడుగుపడింది.ఐకానిక్ టవర్ల నిర్మాణంలో రెండో టవర్ కు ఈరోజు కాంక్రీట్ పనులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్విరామంగా ఈ కాంక్రీట్ పనులు జరుగుతాయి. 225 మీటర్ల ఎత్తు అడుగులో ప్రపంచంలో కెల్లా ఎత్తైన సచివాలయం నిర్మితమవుతుంది. మొత్తం ఐదు టవర్లలో సచివాలయాన్ని నిర్మిస్తారు. 69 లక్షల చదరపు అడుగుల్లో ఐకానిక్ టవర్ల నిర్మాణం జరగనుంది. అత్యాధునిక సౌకర్యాలతో ఈ సచివాలయాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ తాత్కాలిక సచివాలయం మాత్రమే ఉన్న అమరావతికి శాశ్వత సచివాలయం నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి.

Tags:    

Similar News