టీఆర్ఎస్ పై ఖుష్బు తీవ్ర విమర్శలు

Update: 2018-11-20 07:28 GMT

టీఆర్ఎస్ పార్టీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బు తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆమె గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... గత రెండున్నరేళ్లుగా సచివాలయానికి కూడా రాని ముఖ్యమంత్రి ఇప్పుడు గెలిపిస్తే ప్రజలతో ఉంటానని చెబుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మహిళలకు రాజకీయంగా అన్యాయం చేస్తుందన్నారు. ప్రజాకూటమి మహిళలకు 14 ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే, టీఆర్ఎస్ కేవలం నలుగురు మహిళలకు మాత్రమే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిందన్నారు.

కుమార్తెకు తప్ప.....

కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆరు ఎమ్మెల్సీల్లో ఒకరు మహిళ ఉన్నారని, కానీ టీఆర్ఎస్ ఒక్క మహిళను కూడా ఎమ్మెల్సీ చేయలేదన్నారు. 15 మంది టీఆర్ఎస్ ఎంపీల్లో కేసీఆర్ కుమార్తె కవిత తప్ప ఇతర మహిళకు అవకాశ ఇవ్వలేదన్నారు. రాజ్యసభలోనూ ఒక్క మహిళకు కూడా టీఆర్ఎస్ అవకాశం కల్పియ్యలేదన్నారు. కేసీఆర్ కి మహిళలపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. మహిళలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రికి లేదా లేకపోతే మహిళలు ఉన్నత స్థానంలో ఉంటే కేసీఆర్ ఓర్చుకోలేరా అని ప్రశ్నించారు.

Similar News