అలీ ట్విస్ట్ మామూలుగా లేదు..!

సినిమాల కన్నా ఎక్కువగా ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తున్న కమెడియన్ అలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఎప్పటినుండో అలీ రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలొస్తూనే ఉన్నాయి. అయితే [more]

Update: 2019-03-11 09:02 GMT

సినిమాల కన్నా ఎక్కువగా ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తున్న కమెడియన్ అలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఎప్పటినుండో అలీ రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలొస్తూనే ఉన్నాయి. అయితే సినిమాల్లో స్టార్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు అలీ. అలీ లేకుండా పవన్ సినిమాలు లేవన్నట్టుగా పవన్ కి అత్యంత సన్నిహితంగాగా అలీ ఉండేవాడు. ఇక రాజకీయాల్లోకి వస్తున్న అలీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరుతాడనే అంతా అనుకున్నారు. కానీ ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నాడు. నిన్నటివరకు తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చేవారి పార్టీలోనే చేరుతానని స్పష్టం చేసిన అలీ.. టీడీపీలో అలీ చేరడం ఖాయమని అనుకున్నారు.

టీడీపీలో చేరుతాడని అనుకున్నా…

ఇక రాజమండ్రి వాస్తవ్యుడైన అలీ గుంటూరు తూర్పు సీటుని ఆశిస్తూ వచ్చాడు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే.. టీడీపీలో చేరుతాడని అనుకున్న అలీ భారీ ట్విస్ట్ ఇచ్చాడు. అనుకోకుండా ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు. వైసీపీ పార్టీలో చేరడానికి లోటస్ పాండ్ వెళ్లిన అలీ.. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు. అయితే తాను ఈ ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చెయ్యనని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తానని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అన్ని రాజకీయ పార్టీలలో తనకు కావాల్సిన వారు ఉన్నారని.. కానీ జగన్ తోనే ఏపీ భవిష్యత్తు ముడిపడి ఉందని, అందుకే వైసీపీలో చేరానని చెప్పాడు.

Tags:    

Similar News