పాక్ మాజీ ప్రధానికి పదేళ్ల జైలు

Update: 2018-07-06 11:57 GMT

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కి పదేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో ఆయనకు కోర్టు శిక్ష విధించింది. ఆయనతో పాటు ఆయన కూతురు మర్యమ్ కు కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్తాన్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు రావడం సంచలనంగా మారింది. ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న షరీఫ్ కు ఇది భారీ షాక్ గా చెప్పవచ్చు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ కుటుంబం లండన్ లో ఉంటోంది.

Similar News