నేడు వసంత పంచమి.. కిటకిటలాడుతున్న బాసర

నేడు వసంత పంచమి సందర్భంగా పెద్దయెత్తున భక్తులు సరస్వతి క్షేత్రాలకు తరలి వచ్చారు

Update: 2026-01-23 03:07 GMT

నేడు వసంత పంచమి సందర్భంగా పెద్దయెత్తున భక్తులు సరస్వతి క్షేత్రాలకు తరలి వచ్చారు. తెలంగాణలోని బాసర, వర్గల్ దేవాలయాలకు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. బాసరకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు.

అక్షరాభ్యాసం చేయించడానికి...
వసంత పంచమి సందర్భంగా బాసర ఆలయంలో అక్షరాభ్యాసం చేస్తే చదువుల్లో రాణిస్తారని నమ్మకం. నిజామాబాద్ కలెక్టర్ సయితం తన కుమార్తెకు ఇక్కడే అక్షరాభ్యాసం చేశారు. అలాగే వర్గల్ తో పాటు విజయవాడలోని దుర్గగుడిలోనూ అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


Tags:    

Similar News