టెన్షన్ లో ప్రభాస్ ఫ్యాన్స్
తెలంగాణలో ప్రభాస్ ఫ్యాన్స్ కు టెన్షన్ పట్టుకుంది.
తెలంగాణలో ప్రభాస్ ఫ్యాన్స్ కు టెన్షన్ పట్టుకుంది. ప్రీమియర్ షోలకు టైం దగ్గర పడుతున్నా ఇంత వరకూ ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు హైకోర్టులో ఊరట లభించింది. నిర్మాతల వినతులను పరిశీలించాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు నాటి సినిమాలయిన ఓజీ, పుష్ప 2, అఖండ 2, గేమ్ చేంజర్ సినిమాలకే వర్తిస్తాయని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి...
అయితే ఈరోజు ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ప్రీమియర్ షోలు థియేటర్లలో పడాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంత వరకూ అనుమతులు రాలేదు. ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత వరకూ అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారు. అవసరమైతే విజయవాడ, విశాఖపట్నానికి వెళ్లాలని భావిస్తున్నారు. గతంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై ఏ సినిమాకు టిక్కెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతివ్వమని చెప్పిన సంగతి తెలిసిందే.