Telangana : రాజాసాబ్ టిక్కెట్ ధరలు తెలంగాణలో ఎంతంటే...?
తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు అనుమతించింది
తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు అనుమతించింది. నేటి నుంచి ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ నెల 11వ తేదీ వరకూ సింగిల్ స్క్రీన్ లో 105 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 132 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ లో 62 రూపాయాలు, మల్టీప్లెక్స్ లో 89 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఇరవై శాతం లాభాన్ని...
అయితే సినిమా ద్వారా వచ్చిన లాభాల్లో ఇరవై శాతం మొత్తాన్ని ఫిలిం ఫెడరేషన్ కు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజా సాబ్ మూవీ నేటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో హైకోర్టు సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రీమియర్ షోలకు మాత్రం టిక్కెట్ ధరలు నిన్న పెంచలేదు.