Telangana : నేడు గద్దర్ అవార్డుల ప్రదానం

సినీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ పురస్కారాలను నేడు ప్రదానం చేయనుంది

Update: 2025-06-14 01:56 GMT

సినీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ పురస్కారాలను నేడు ప్రదానం చేయనుంది. గద్దర్ అవార్డులను ఇప్పటికే జ్యూరీ ప్రకటించింది. అయితే ఈ రోజు హైటెక్స్ లో జరిగే కార్యక్రమంలో గద్దర్ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని వేడుకగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు అవార్డులు ఇవ్వకపోడంతో నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

2014 నుంచి 2023 వరకూ...
గద్దర్ అవార్డులను ఇప్పటకే ప్రకటించడంతో విజేతలకు నేడు అవార్డులను అందచేయనున్నారు. ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేసేందుకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకూ అన్ని విభాగాల్లో గద్దర్ అవార్డులను నేడు అందచేయనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.


Tags:    

Similar News