బీఆర్ఎస్ కు భారీ షాక్.. ఒక్కసారిగా పార్టీ మారడంతో?

కరీంనగర్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుంది. నేడు కరీంనగర్ మేయర్ తో పాటు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మారనున్నారు

Update: 2025-01-25 04:29 GMT

కరీంనగర్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుంది. నేడు కరీంనగర్ మేయర్ తో పాటు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మారనున్నారు. మేయర్ సునీల్ రావుతో పాటు పది మంది కార్పొరేటర్లు కమలం పార్టీ లో నేడు చేరనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వారు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సునీల్ రావు పార్టీని వీడటంతో బీఆర్ఎస్ పెద్ద ఇబ్బందిగా మారనుంది.

ప్రతి ఎన్నికల్లోనూ...
కరీంనగర్ లో ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు విజయాన్ని కరీంనగర్ ప్రజలు అందిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ వైపు విజయాలు తొంగి చూశాయి. అయితే క్రమంగా బీఆర్ఎస్ బలహీనపడుతుండటంతో కార్పొరేటర్లు, మేయర్లు బీజేపీ వైపు చూస్తున్నారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ ఆధిక్యతను సంపాదించనుంది.


Tags:    

Similar News