లైఫ్ స్టైల్: మగువల అందాల్ని మరింత పెంచేది...

Update: 2018-02-18 10:19 GMT

అమ్మాయిలకు అలంకరణనే అందం.అందానికి నిర్వచనం కేవలం ఆడవారు మాత్రమే అని చెబుతారు కవులు,రచయితలు.మగువ ఏ డ్రెస్స్ వేసుకున్న అందంగానే కనిపిస్తారు.అందులోను చీర కట్టుకునే వనితలు మరీ అందంగా కనిపిస్తారు.చీరకట్టు విధానం మన పూర్వీకుల కాలం నుంచి వస్తుంది.ఇది మన భారతదేశం యొక్క సంప్రదాయం.ఫ్యాషన్ కు ఆధునికత తోడై ఇప్పుడు చీర కట్టే విదానంలో ఎన్నో మార్పులు వచ్చాయి.రకరకాలుగా చీరను కట్టుకుంటున్నారు వనితలు.చీరకు శారీ పిన్స్,సెప్టీ పిన్స్ పెట్టుకుంటున్నారు.కానీ ఇప్పుడు ఎక్కువగా శారీ పిన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నారు.చీరకు పెట్టుకునే శారీ పిన్స్ లో రకరకాల డిజైన్స్ తో కూడిన ఫ్యాషన్ పిన్స్ లభిస్తున్నాయి.ఫ్యాషన్ ఇండస్ట్రీ వాళ్ళు మగువల కోసం తయారుచేసే ప్రతి వస్తువుపై ఆసక్తి చూపిస్తారు.వనితలు ఉపయోగించే ప్రతిది ఫ్యాషనే.అందుకే ఇప్పుడు ఎక్కువగా శారీ పిన్స్ మార్కెట్ లో లభిస్తున్నాయి.రకరకాల రాళ్లతో,పూసలతో,గజ్జేలతో ,రకరకాల డిజైన్స్ లో లభిస్తున్నాయి.ఇవి చీర రంగుకు, డిజైన్స్ కు తగిన విధంగా ఉంటున్నాయి .చీర కట్టుకున్న తరువాత చీరకు ఈ పిన్స్ పెట్టుకుంటే చీరకట్టు అందంగా కనిపిస్తుంది.

రకరకాల డిజైన్స్ లో వేలాడే పిన్స్ లభించడం వలన మగువలు,కాలేజ్ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.చీరకట్టులో ఈ శారీ పిన్స్ ఆకర్షిణీయంగా ఉంటున్నాయి.ఇప్పుడు ఈ చీర పిన్స్ ఫ్యాషన్ టేండ్రీ గా మారిపోయింది......

Similar News