ప‌వ‌న్ పోటీ ఇక్కడే...!

Update: 2017-11-11 14:30 GMT

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్ ఇప్ప‌టికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండు తెలుగు రాష్ట్రాల్లోను పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఇక జ‌న‌సేన వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం ముందుగా జ‌న‌సేన బ‌లంగా ఉన్న స్థానాల ఎంపిక జ‌రుగుతోంద‌ట‌. ఓ వైపు జ‌న‌సేన నుంచి పోటీ చేసేందుకు క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్య‌ర్థుల అన్వేష‌ణ ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తోంది. ముందుగా ఏపీ, తెలంగాణ‌లో ఉన్న 42 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొంద‌రు బాధ్యుల‌ను నియ‌మించి ఆ త‌ర్వాత క్షేత్ర‌స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆ త‌ర్వాత రాష్ట్ర స్థాయి ప‌ద‌వుల‌ను నియ‌మించాల‌ని జ‌న‌సేనాని ప్లాన్ చేస్తున్నారు.

అనంతపురం నుంచి అయితే...

ఇదిలా ఉంటే ప‌వ‌న్ ఇప్ప‌టికే తాను ఎమ్మెల్యేగా ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేదానిపై క్లారిటీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని చెప్పారు. దీంతో ప‌వ‌న్ అనంత‌పురం జిల్లాలో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాడ‌నేదానిపై ర‌క‌రకాలుగా చ‌ర్చించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే జిల్లాలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప‌వ‌న్ ముందుగా అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో అనంతపురం అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గం బ‌రిలో ఉంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఆ త‌ర్వాత గుంత‌క‌ల్లు పేరు వినిపించింది. ఇక చివ‌ర‌గా క‌దిరి పేరు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య పొత్తు కుదిరితే ప‌వ‌న్ జిల్లాలోని క‌దిరి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని అటు టీడీపీ వ‌ర్గాలు, ఇటు జ‌న‌సేన వ‌ర్గాలు కూడా చ‌ర్చించుకుంటున్నాయి. ప్ర‌స్తుతం క‌దిరి నుంచి వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యే అత్త‌ర్ చాంద్ పాషా ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్క‌డ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంక‌ట‌ప్ర‌సాద్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఆశిస్తున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఇప్ప‌టికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ టిక్కెట్ అంశంపై వార్ జ‌రుగుతోంది. ఇక టీడీపీ వ‌ర్గాల్లో కూడా ఒక‌వేళ టీడీపీ+జ‌న‌సేన పొత్తు ఉంటే చంద్ర‌బాబు ప‌వ‌న్‌ను క‌దిరి నుంచే పోటీ చేయిస్తార‌ని కూడా గుసగుస‌లు వినిపిస్తున్నాయి.

సొంత జిల్లాలో రూమ‌ర్లు....

ఇదిలా ఉంటే ప‌వ‌న్ రెండో నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా పోటీ చేయాల‌ని భావిస్తే ఆ జిల్లాలోని ప‌వ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌సాపురంతో పాటు గ‌తంలో త‌న అన్న చిరు ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ పోటీ చేస్తార‌ని ఆ జిల్లాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ప‌వ‌న్ కొద్ది రోజుల క్రింద‌ట ప‌శ్చిమగోదావ‌రి జిల్లా కేంద్ర‌మైన ఏలూరులో ఓటు హ‌క్కు న‌మోదు చేయించుకుంటాన‌ని చెప్పారు. ప‌వ‌న్ ఏలూరులో ఉండేందుకు వీలుగా ఓ ఇంటి కోసం అన్వేష‌ణ కూడా చేశారు. టీడీపీతో పొత్తు ఉంటే పాల‌కొల్లు లేదా న‌ర‌సాపురం టిక్కెట్ ప‌వ‌న్‌కు సులువుగా వ‌స్తుంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోను ప‌వ‌న్ సామాజిక వ‌ర్గ ఓట‌ర్ల‌తో పాటు ప‌వ‌న్‌ను అభిమానించే వ‌ర్గాలు కూడా బ‌లంగా ఉన్నాయి.

కొత్త‌గా నెల్లూరు, శ్రీకాకుళం....

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ అనంత‌పురం, ప‌శ్చిమగోదావ‌రి జిల్లాల నుంచి మాత్ర‌మే ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని అంద‌రూ అనుకుంటుంటే ఇప్పుడు కొత్త‌గా శ్రీకాకుళంతో పాటు నెల్లూరు జిల్లాల పేర్లు కూడా తెరమీద‌కు వ‌స్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కులాల గోల త‌క్కువుగా ఉంటుంది. అదీకాక ప‌వ‌న్‌కు అక్క‌డ పెద్ద‌సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో తూర్పుకాపుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. ఇక త‌న‌కు విద్యార్థి ద‌శ నుంచి అనుభ‌వం ఉన్న నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా ప‌వ‌న్ పోటీ చేయ‌వ‌చ్చ‌న్న టాక్ జ‌న‌సేన వ‌ర్గాల నుంచే వినిపిస్తోంది. ఇక్క‌డ కూడా రెడ్లు బ‌లంగా ఉన్న ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గ ఓట‌ర్లు ఉన్నారు. దీనికి తోడు ఇక్క‌డ కూడా ప‌వ‌న్‌కు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఏదేమైనా ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేస్తే అనంత‌పురం జిల్లాలోని క‌దిరి నుంచి పోటీ చేసేందుకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయంటున్నారు. ప‌వ‌న్ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఎంచుకుంటే ప‌వ‌న్‌కు చాలా ఆప్ష‌న్లు ఉన్నాయి. మ‌రి వీటిల్లో ప‌వ‌న్ చాయిస్ ఎలా ఉంటుందో ? మాత్రం తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే

Similar News